Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని ఎంపీపపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఎం.నవనీతకు రూ.50 వేలు, బి.నరేందర్‌రెడ్డికి రూ.లక్ష చెక్కులను వారి నివాసా లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ లబ్దిపొందే విధంగా ఉన్నాయన్నారు. నియోజక వర్గంలో అనారోగ్యంతో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి చెక్కులను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహకా రంతో మండలంలోని అర్హులందరికీ అందేలా చూస్తు న్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మిడి జలజా సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యులు బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల రైతు విభాగం అధ్యక్షుడు, సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి, కీసర గుట్ట ట్రస్టు బోర్డు డైరెక్టర్ మేరుగు నరేష్‌గౌడ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చింతకింది వేణు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చింతల గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల జాయింట్ సెంక్రెటరీ మేడబోయి రాజు, ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అంజనేయులు, నాయకులు కొమ్మిడి దామోదర్‌రెడ్డి, గడ్డం శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.