Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రెడ్‌బుల్ అమెచ్యూర్ గోకార్డు జాతీయ స్థాయి ఫైనల్ పోటీలకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైదికైంది. నాలుగో ఎడిషన్ రెడ్‌బుల్ కార్టు ఫైట్ నేషనల్ ఫైనల్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. గత నెల 6వ తేదీన క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. ముంబయి, చైన్నై, హైదరాబాద్, బెంగళూరు, బరోడా, గురుగ్రాంలో నిర్వహించారు. 800 మందికిపైగా ఇందులో పాల్గొ న్నారు. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ టోర్నీలో రాణిం చిన 18 మంది క్రీడాకారులకు శామీర్‌పేట మండలం బొమ్మరాశి పరిధిలోని లియోనియా రిసార్ట్స్‌లో ఫైనల్ నిర్వహించారు. ప్రథమ స్థానంలో ఓజాన్ సర్వే, రెండో స్థానంలో ఇషాన్ బర్డె, తృతీయ స్థానంలో అభిజిత్ కుమార్ నిలిచారు. అబుదాబిలో నిర్వహించే ఛాంపియన్షిప్ పోటీ లకు వీరు అర్హత సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు. రెడ్‌బుల్ ఇంటర్నేషల్ ఫార్ములా ఫోర్ ఛాంపియన్ షిప్ పొందిన తొల భారత క్రీడాకారిణి అథ్లెటిక్ మీరా ఎరడా విజేతలకు జ్ఞాపికలను అందజేశారు.