Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో డ్రయినేజీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్‌లో డ్రయినేజీ పైప్‌లైన్ పనులకు కార్పొరేటర్ సునీత గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రయినేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లలితానగర్‌లో 1.30కోట్ల వ్యయంతో నాలుగు దఫాలుగా డ్రయినేజీ పైప్‌లైన్ పనులు చేపడుతామన్నారు. అందులో భాగంగా మొదటిదశలో దీక్ష స్కూల్ లేన్‌లో రూ.24 లక్షల వ్యయంతో నూతన పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈపనులను నెలరోజుల్లో పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు నారాయణగూడ జీఎం సుబ్బారాయుడు, చిలకలగూడ డీజీఎం వాహబ్, మేనేజర్ వెంకట రమణ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బల్ల శ్రీనివాసరెడ్డి, సురేందర్, మనోహర్ సింగ్, శ్యామ్ సుందర్, మల్లికార్జున్ రెడ్డి, మహమ్మద్ ఖదీర్, ఆకారం శ్రీనివాస్, రవి యాదవ్, మల్లికార్జున్ రెడ్డి, ప్రేమలతా రెడ్డి, మాధవ్, టైలర్ శ్రీనివాస్, రఘు, సత్యనారాయణ, సుబ్బారావు, బీజేపీ నాయకులు నరేష్, కిశోర్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.