Authorization
Fri April 04, 2025 03:20:24 am
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్(ఐఎస్‌సీసీఎం) హైదరాబాద్ చాప్టర్, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీ క్యాంపస్‌లో 'డిఫికల్ట్ ఎయిర్ వే' వర్క్‌షాప్ నిర్వహించారు. ఈవర్క్ షాప్‌ను అపోలో హాస్పిటల్స్ సెంట్రల్ జోన్ సీఈఓ వై. సుబ్రహ్మణ్యం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాధిబారిన పడిన రోగుల్లో ఎయిర్ వే నిర్వహణపై అపోలో సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డాక్టర్ కె. సుబ్బారెడ్డి, ఇతర క్రిటికల్ కేర్ కన్సల్టెంట్లు తమ అనుభవాలను మీడియా సమావేశంలో తెలిపారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా వంద మందికి పైగా క్రిటికల్ కేర్, ఇతర స్పెషలిస్టులు ఈకార్యక్రమానికి హాజరయ్యారని, ఎయిర్ వే మేనేజ్మెంట్లో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, సమర్థవంతమైన ఎండో ట్రాషియల్ ఇముట్యూభేషన్లో వచ్చిన తాజా మెళుకువలను వివరించారు. ఇముట్యూభేషన్ అనేది ఐసీయూలో పనిచేసే వైద్యులందరూ రోగుల ప్రాణాలను రక్షించడంలో అవలంభించే నైపుణ్యం అని తెలియజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను ముందుగానే స్థిమిత పరచి, మొత్తం రోగి సంరక్షణను మెరుగుపరచడంలో క్రిటికల్ కేర్ వైద్యులకు శిక్ష ఇవ్వడమే ఈ వర్క్ షాప్ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ దేశ వ్యాప్తంగా 76 నగరాలలో10131 మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద సంస్థ అని తెలిపారు.