Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కొన్ని వాహనాలను బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌లు తిరిగి ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని ఈనెల 5వ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సీజ్ చేసిన పలు వాహనాలు పోలీసు శాఖ తీరిగి ఇవ్వటాన్ని ప్రారంభించింది. గుర్తింపు పత్రాలను తమ వద్ద పెట్టుకుని సదరు వ్యక్తులకు పోలీసులు వాహనాలను ఇస్తోంది. అయితే ఇక్కడ పోలీసులకు ఒక చిక్కు వచ్చి పడింది. కొందరు మైనర్లు వాహనాలు నడిపి దొరకడంతో సదరు వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్‌లను గుర్తింపుకార్డులను తీసుకోవాల్సి వస్తుంది. రెండవది జిల్లాల్లో కొందరు వద్ద వాహనానికి చెందిన ధ్రువీకరణ పత్రాలు ఉంటున్నాయి. వాటిని అధికారులకు ఇవ్వడానికి చదువు వాహన దారుల వద్ద నకిలీవి మాత్రమే ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యలను ఏ విధంగా పూర్తి చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. అదేవిధంగా మద్యం సేవించి పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని, వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448-ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని హైకోర్టు చెప్పింది.తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పంజాగుట్ట బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ వాహనాలు సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చి వాహనాలు తీసుకెళ్లొచ్చని పోలీసు అధికారులు తెలిపారు.