Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. లింబాద్రిని ఓయూ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఎల్లేశ్ గౌరవపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సత్కరించారు. ఈసందర్భంగా ఎల్లేశ్ మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా ఎన్నికైన లింబాద్రి ఉన్నత విద్య విషయంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరారు.