Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఏళ్ల తరబడి ఆస్తిపన్ను బకాయిపడ్డ భవనదారులపై మహానగర పాలక మండలి అధికారులు కొరడా ఝళిపిస్తూన్నారు. ఖైరతాబాద్ జోనల్ పరిధిలోని సర్కిళ్లలో వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్నాయి. చాలా సంస్థలు ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బల్దియాకు భారీగా బకాయిలు పడ్డారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దష్టి సారించి బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు మూడు దఫాలు నోటీసులు జారీ చేసిన స్పందించని వారికీ ప్రత్యేక నోటీసులు జారీ చేసి ఆ వ్యాపార వాణిజ్య సంస్థ ఏదైనా ఆ భవనాన్ని సీజ్ చేస్తున్నారు. నూతన జోనల్ కమిషనర్ వచ్చిన తర్వాత దాదాపు 267 కోట్లు వసూలు చేశారు. గతేడాదిలో వన్ టైం టాక్స్ సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం. అయినా కూడా కొందరు టాక్సులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు అలాంటి వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తుండడంతో అక్కడికక్కడే చెల్లిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా సుమారు ఏడేండ్ల నుంచి రూ.కోట్ల 92 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్న పంజాగుట్ట ప్రధాన రహదారికి పక్కనే ఉన్న హోమ్ టౌన్ బిల్డింగ్‌ను పలు దఫాలుగా నోటీసులు ఇచ్చి విసిగిపోయిన జిహెచ్ఎంసి సర్కిల్ 17 అధికారులు చివరకు బుధవారం సీజ్ చేశారు. మహానగర పాలక మండలికి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.