Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జాయింట్ కమిషనర్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గా నగర్, అంబేద్కర్ నగర్లో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ అంబర్పేట పోలీసులు, అదనపు బలగాలతో 150 మందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. అక్రమంగా అమ్ముతున్న గంజాయి, గుట్కాల పై సోదా చేయగా నిషేధిత గుట్కాలు 1000 ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. యూత్ ప్రజలు గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని హితవు పలికారు. అంతేకాకుండా డాక్యుమెంట్ పేపర్స్ సరిగ్గా లేనివి, నంబర్ ప్లేట్ లపై స్క్రాచ్ ఉన్నవాటిని 29 ద్విచక్ర వాహనాలలు, 10 ఆటోలను సీజ్ చేశారు. ఫారన్ దేశంలో నుండి టాక్స్ లు కట్టకుండా స్మగ్లింగ్ రూపంలో తీసుకొస్తున్న సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, సీఐ సుధకర్, డీఐ శ్రీధర్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.