Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ పరిధిలో భవన్ విద్యార్థులు చేస్తున్న ర్యాలీలో పాల్గొని ప్రజలకు స్వచ్ఛ ఆటో ప్రాముఖ్యతను, తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించామని సర్కిల్ పారిశుధ్య పర్యవేక్షణ అధికారి మనోహర్ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి రాజు ఆదేశాల మేరకు స్వచ్ఛ అవగాహనలో భాగంగా డిఫెన్స్ కాలనీ, నేరెడ్ మెట్, సైనిక్ పురి, వాయుపురి కాలనీలలో సీనియర్ యూనిట్ ఆఫీసర్ అల్లం శ్రీధర్, జూనియర్ యూనిట్ ఆఫీసర్ దీపిక ఆధ్వర్యంలో భవన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సాలిడ్ వేస్ట్పై ర్యాలీలు, ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నారు. ఈసందర్భగా స్వచ్ఛ ఆటో ప్రాముఖ్యత, తడి, పొడి చెత్త వేరుచేసే విధానం అదేవిధంగా వ్యర్థపదార్థాలతో ఇంట్లోనే కంపోస్టు చేసుకుని మొక్కలకు ఎరువుగా వాడుకునే విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో భవన్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఎన్సీసీ విద్యార్థులు, నేరెడ్మెట్ డివిజన్ సానిటరీ జవాన్ షేక్ అహ్మద్, ట్రాఫిక్ పోలీసులు భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.