Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండి టీఆర్ఎస్ అభివద్ధికి ఎనలేని కషి చేసిన ఎంబీసీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మల్కాజిగిరి కుమ్మరి సంఘం సభ్యులు దుబ్బాక బాలనరసింహ కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు కుమ్మరుల ఓట్లతో గత ప్రభుత్వాలు పదవులు పొందారు తప్ప చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు. తరాలు మారిన కుమ్మరులు ఓట్లకే పరిమితం అవుతున్నారు తప్ప రాజకీయ పదవులకు అనర్హులు కావడం లేదని తెలిపారు. కుమ్మరులకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని, మొదటిసారి తాడూరి శ్రీనివాస్‌కు అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి చరిత్రలో నిలుస్తారు అని అభిప్రాయపడ్డారు. తాడూరి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని యావత్ తెలంగాణ రాష్ట్ర కుమ్మరులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని, తమ వర్గానికి చెందిన వారికి చట్టసభల్లో నేటి వరకు ప్రాతినిధ్యం లేదని ఆయన గుర్తు చేశారు.