Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఘట్కేసర్ రూరల్
దశల వారీగా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఇన్చార్జి సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ పంచాయితీ పాలకవర్గం సాధారణ సమావేశం ఇన్చార్జి సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దశలవారీగా అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రయినేజీ ఏర్పాటు, దాతల సహాకారంలో వైకుంఠ ధామం అభివృద్ధికి పాలకవర్గం ఐక్యతతో కృషిచేస్తుందని తెలిపారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మధు, వార్డు సభ్యులు వేముల పరమేష్ గౌడ్, వడ్త్య పవన్ నాయక్, చిలుగూరి భాస్కర్, వేముల పద్మ, వేముల శోభ, గుగులోత్ కాంతమ్మ, వేముల శ్వేత, తదితరులు పాల్గొన్నారు.