Authorization
Fri April 04, 2025 12:53:17 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కల్లుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? కాంగ్రెస్ పార్టీవా అని నిలదీశారు. తెలంగాణలో కల్లు మండువలు (డిపోలు) ముమ్మాటికి రాజకీయ వేదికలే అని, తెలంగాణ జనజీవన సాంస్కతిలో కల్లు అంతర్భాగమని నొక్కి చెప్పారు. 2004 ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేసి వేలాదిమంది గౌడ కుటుంబాల జీవనోపాధి లేకుండా చేశారని విమర్శించారు. మళ్లీ రేవంత్ రెడ్డి మాటలు, అదే ఆలోచనకు దారి చూపెడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కల్లుగీత వృత్తికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. రేవంత్‌రెడ్డి కల్లుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గౌడ ఐక్యసాధన సమితి కార్యనిర్వహక అధ్యక్షులు బబ్బురు బిక్షపతి, అధికార ప్రతినిధులు పంజాల నర్సింహగౌడ్, కొప్పుల రవీందర్ గౌడ్, నగర అధ్యక్షులు నాగులూరి జగదీశ్వర్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గొల్లెపల్లి స్వామిగౌడ్, నాయకులు ముద్దగోనె దశరథ గౌడ్, డి.వెంకటేష్ గౌడ్, కె. సునీల్‌బాబు గౌడ్, తీగుళ్ల వేణుగౌడ్, పి . కన్నబాబు గౌడ్ పాల్గొన్నారు.