Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఏడాది వ్యవధిలో తనపై నాలుగు పర్యాయాలు హత్యాయత్నం జరిగిందని కింగ్‌కోఠి వాసి అలీబగ్థాదీ తెలిపారు. ఇటీవల నలుగురు వ్యక్తులు రాడ్లు పట్టుకుని దాడి చేశారని చెప్పాడు. శుక్రవారం కింగ్‌కోఠి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు చంపేందుకు కొందరు వ్యక్తులు దాడి చేశారన్నాడు. ఈవిషయాలపై నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదయ్యిందన్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు ఎవరినీ పట్టుకోకపోవడం వల్ల మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.11వ తేదీన కింగ్‌కోఠి ఎస్బీఐ బ్యాంకు అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు రాడ్లు పట్టుకుని బైక్‌పై వెంట పడ్డారని, ఆ దాడిలో రాడ్డుతో నన్ను కొట్టగా మోకాలిపై, చేతికి గాయాలు అయ్యాయన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.: