Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వారాసిగూడలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ వారు ఫ్రీ లీగల్ సర్వీసెస్ క్యాంపు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ పి. లక్ష్మి, ఇతర ప్రొఫెసర్స్ విద్యార్థినిలు క్యాంపునకు విచ్చేసిన వారికి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. తమ కాలేజీ ఉచిత న్యాయ సలహాలను ఎప్పుడు అందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, సుప్రీంకోర్టు న్యాయవాది రామచంద్రరావు హాజరయ్యారు. తమ సలహాలను సూచనలను న్యాయశాస్త్ర విద్యార్థులకు అందించారు. న్యాయవాద వత్తి అతి పవిత్రమైనదని, దాని విలువలను కాపాడుతూ అందరూ విజయవంతమైన లాయర్లు ఎదగాలని, ఉచిత న్యాయ సేవలు పేదలకు అందించాలని తెలిపారు.