Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
22 సంవత్సరాల భాగస్వామ్యంతో పలు ఆలయాల వద్ద ఆధ్యాత్మిక సంస్థల వద్ద విలాసవంతమైన గదులు లగ్జరీ రూములను సామాన్య మానవులకు అందుబాటు ధరలో అందించేందుకు కషి చేస్తున్నట్లు భారతదేశ జనరల్ మేనేజర్ వికాస్ అహ్లువాలియా, రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పార్క్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో విలేకరులతో ముచ్చటించారు. వంద కోట్ల పెట్టుబడితో ఆరు వందల మందికి ఉపాధి కల్పిస్తూ 420 రెండున్నర ఎకరాల విశాలమైన స్థలంలో యాదాద్రి ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో జోన్ కనెక్ట్ అనే పేరుతో లక్ష్మీ నిలయం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాబోయే మార్చిలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు చేపడుతూ దానికి అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు పలు నిర్మాణాలు చేపట్టేందుకు చేస్తున్న కషికి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.