Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశవ్యాప్తంగా ఉన్న దేవాదాయ భూములను నిరుపేదలకు పంచాలని స్వామి హతిరాంజీ మాట్, టీటీడీ మాజీ చైర్మెన్ లచ్చి రామ నాయక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ రెవెన్యూ అధికారి లక్ష్మణ్‌తో కలిసి వారు ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు, జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.