Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృతి చెందిన మహిళా వాచ్మెన్్ కుటుంబానికి న్యాయం చేయాలి
విజ్ఞాన్పురి కాలనీలోని అపార్టుమెంట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్పురి కాలనీలో ఓ అపార్టుమెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న మహిళ శుక్రవారం బోరు మోటార్ స్విచ్ ఆన్ చేయబోతూ.. మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబానికి సమా చారం ఇవ్వకుండా పోస్టుమార్టం నిర్వహించారనీ, అసలు ఆమె ఎలా మృతి చెందిందో అనుమానాలు ఉన్నాయనీ, దీనిపై విచారణ జరిపి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) నాయకులు ఎం.చంద్రశేఖర్, రాజశేఖర్, కేవీసీపెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఘటన జరిగిన అపార్టుమెంట్ ఎదుట ధర్నా చేశారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వ్యవహరించిన ఇంటి యజమానిని పోలీసులు కూడా ఎందుకు అనుమానించలేదనీ, ఎందుకు అరెస్టు చేయ లేదని ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసి మహిళా వాచ్ మెన్ మృతికి గల కారణాలను తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎం. చంద్రశేఖర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.