Authorization
Thu April 03, 2025 10:06:02 pm
చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
నవతెలంగాణ- సరూర్‌నగర్
పేదలకు ఉచిత వివాహం చేయడం గొప్ప విషయమని టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం ఆర్.కె.పురం డివిజన్ వాసవి కాలనీ లోని వాసవి సంక్షేమ సంఘం భవనంలో వాసవి ఆర్యవైశ్య ఉచిత కల్యాణ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త పాల్గొని నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదిం చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య ఉచిత కల్యాణ సేవా సంస్థ అధ్యక్షుడు గౌరిశెట్టి చంద్రశేఖర్, అధ్యక్షుడు జగిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.