Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధి సంస్కృతి టౌన్షిప్లో తెగులు సోకి ఎండిపోతున్న వేపచెట్లకు స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్రావు ఆధ్వర్యంలో బావిస్తీన్ 50ఈసి, క్లోరిపీరిఫాస్ 20ఈసి ద్రావణాన్ని తగినంత మొతాదు నీటిలో కలిపి వేపచెట్లకు స్ప్రే చేసి ద్రావణాన్ని చెట్లు మొదట్లో పోశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడు తూ టౌన్షిప్లో తెగులుతో ఎండిపోతున్న చెట్లను సంరక్షించుకోడానికి శాస్త్రవేత్తల సలహాల మేరకు చెట్లకు ఇట్టి ద్రావణాన్ని పోయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, మున్సిపల్ సిబ్బంది పాల్గ్గొన్నారు.