Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి
నవతెలంగాణ-ఘట్‌కేసర్‌రూరల్
మనిషికి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్న వేపచెట్లు తెగులు సోకి ఎండిపోతున్నాయని, అవి ఎండిపోకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని చైర్మెన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని యాదాద్రి పార్కు సమీపంలోని వేపచెట్లకు 5500 లీటర్ల నీటిలో బావిస్తీన్ 5కేజీలు, క్లోరిపీరిఫాస్ 20ఈసి 20 లీటర్ల ద్రావణాన్ని కలిపి శనివారం కమిషనర్ సురేష్‌తో కలసి వేప చెట్ల మొదళ్ల వద్ద చెట్టుకు 10లీటర్ల చొప్పున ద్రావణం పోశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ ఈ ద్రావణం చెట్టు మొదట్లో పోయడం వలన వేర్లలోకి వెళ్లి చెట్లుకు పట్టిన చీడ వదిలిపోతుందని, దాని ద్వారా చెట్టు యదా స్థితికి చేరుకుంటుందని అన్నారు. గత వారం క్రితం సంస్కృతి టౌన్షిప్లో మొదటిసారిగా ద్రావణం పోయడం జరిగిందని, కొంత ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా చెట్లకు పిచికారి చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్‌రావు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, తదితరులు పాల్గ్గొన్నారు.