Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కష్టపడితేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) అన్నారు. బాలల దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని 650 అనాథ ఆడపిల్లలకు మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా సంక్షేమాధి కారి అక్కేశ్వర్రావు ఆధ్వర్యంలో అదివారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు తీసుకువెళ్లారు. దీనికి ముజీబ్ను ఆహ్వనించారు. వారి అభ్యర్థన మేరకు అనాథ పిల్లలందరినీ ముజీబ్ కలుసుకు న్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనుభవాలను పంచుకున్నారు. వారి నిబద్ధతను, కృషిని అభినందించారు. పిల్లలకు అల్పాహారం కోసం 15వేల రూపాయలను టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా ఫండ్ ద్వారా అందించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అనాథ పిల్లలకు సూచించారు. బాలల సంక్షేమం, భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ముజీబ్ కొనియాడారు. పిల్లల బంగారు భవిష్య త్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రారంభించి నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యక్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు కె.శ్రీనివాస్, నరేష్, మాజీ సెక్రటరీ జి.ప్రభాకర్, ముఖీం, రజ్వీ, ఇంతియాజ్ రహీం పాల్గొన్నారు.