Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గ్యార క్రాంతి కుమార్
నవతెలంగాణ -సరూర్నగర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ సెమిస్టర్ ఇన్స్టంట్ బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించకుండానే పీజీ సెట్ ప్రక్రియను ప్రారంభించడం సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గ్యార క్రాంతి కుమార్ అన్నారు. కరోనా వల్ల పంచవ్యాప్తంగా అన్ని రంగాలు చాలా దెబ్బతిన్నాయని అన్నారు. ముఖ్యంగా విద్యా రంగం చాలా వెనుకబడిపోయిందని, దీంతో విద్యార్థులు చదువుకు చాలా మంది దూరమయ్యారని అన్నారు. ఇలాంంటి పరిస్థితుల్లో అవేమీ దష్టిలోకి తీసుకోకుండా కౌన్సిలింగ్ ప్రారంభించడం సరైంది కాదని, పలుమార్లు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్, ఓయు వీసీ, పీజీ సెట్ కన్వీనర్ దష్టికి తీసుకెళ్లగా ఈనెల 20 వరకు పొడిగించడం సరైంది కాదని, పరీక్షలు నిర్వహించిన అనంతరం వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభించాలని, అధికారుల నిర్ణయాల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు.