Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 25 ఏండ్లు అయినప్పటికీ ఇప్పటి వరకు చట్టంగా కార్యరూపం దాల్చలేదని, చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ (పీవోడబ్ల్యు) ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహించారు.
అంతకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కొటె, పీవోడబ్ల్యూ సంధ్య, ఓయూ ప్రొఫెసర్ లక్ష్మి తదితరులు హాజరై మాట్లాడారు. మహిళలకు శాసనసభలో 33 శాతం సీట్ల కేటాయింపు కోసం రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతి ఇచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లును 19 సెప్టెంబర్ 12న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తరఫున హెచ్ దేవగౌడ లోక్ సభలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ బిల్లు 25 సంవత్సరాలుగా పార్లమెంట్లో పెండింగ్లో ఉందన్నారు. భారతీయ ప్రజాస్వామ్య సాధనలో అతిపెద్ద సంస్కరణ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేయడంలో రాజకీయ చిత్తశుద్ధి కనబడటం లేదన్నారు.
విధాన నిర్ణయాలలో మహిళలను భాగస్వాములు చేయకపోవడంతో పరిపాలనలో నాణ్యత ప్రమాణాలు తగ్గుతాయన్నారు. పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కనీజ్ ఫాతిమా, బి.రమాసుందరి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనురాధ, నాయకులు నిర్మల, సరళ, పద్మ, ఐలమ్మ, కల్పన పాల్గొన్నారు.