Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ ఇ.విజరుకుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కషి చేస్తానని అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. ఈమేరకు శనివారం ప్రేమ్‌నగర్‌లో స్థానిక అధికారులతో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు రోడ్డు ప్యాచ్ వర్క్, డ్రయినేజీ ప్రాబ్లం, విద్యుత్ దీపాల సమస్య ను తెలుసుకొని సంబంధిత సిబ్బందిని పిలిచి వెంటనే మరమ్మతులు చేయవలసిందిగా అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.