Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కో- ఆర్డినేటర్లు మాట్లాడుతూ పార్టీ పటిష్ఠతకు ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ పాల్గొన్నారు. నాగారం మున్సిపాల్టీ నుంచి వివిధ పార్టీల వారు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ కార్యవర్గ ఎంపిక, డివిజన్ అధ్యక్షుల ఎంపిక, పార్టీ సభ్యత్వం చేర్పించడం కోసం ఎన్ రోలర్స్ ఎంపిక కోసం చర్చించారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్‌గౌడ్, నాగారం మున్సిపల్ కార్యనిర్వాహక అధ్యక్షులు నల్లోల కుమార్, తూంకుంట మున్సిపల్ అధ్యక్షులు భీమిడి జైపాల్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు హరిబాబు, ర్యాల ప్రియాంక అనిల్ యాదవ్, చింతల సరిత రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నాగారం మాజీ సర్పంచ్ అశోక్‌గౌడ్, మైపాల్‌రెడ్డి, పొట్ట శ్రీశైలం, కురుమ మణికంఠ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, పరమేష్, చంద్రయ్య, పొట్ట విగేష్, కె నరేందర్, మీసాల మల్లేష్, బాలు యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మ, రాధిక, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.