Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రిలో ఆదివారం
బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఎస్ ఎల్జీ డైరెక్టర్ అండ్ చైర్మెన్ ఫన్ యోగాను ప్రారంభించారు. అష్టాంగ యోగ బోధకురాలు కుమారి అనుభూతి దీక్షిత్ నిర్వహించిన ఈ యోగ కార్యక్రమం డాక్టర్ ఆరతి బళ్లారి, డాక్టర్ ఎం.అరవింద్ కుమార్, డాక్టర్ పవన్ కుమార్ డా. ప్రయాగ జ్యోత్స్న లు వివరిస్తూ చిన్నతనంలో ఊబకాయం, దానివల్ల మధుమేహం వచ్చే అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. ఎదిగే పిల్లల శరీరాభివద్ధికి, వారి ఒళ్లు విల్లులా వంగడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. . యోగాతో క్రమశిక్షణ మెరుగుపడి, ప్రచోదనం తగ్గుతుంది. పిల్లలు తమ గురించి తాము చెప్పుకొనే అవకాశం రావడంతో, తరగతి గదుల్లో వారి సమస్యాత్మక ప్రవర్తన కూడా తగ్గుతుంది. వార్మప్ చేయడం, ఒళ్లు వంచడం, మానసిక ఉల్లాసం, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం లాంటి సాధారణ టెక్నిక్లను నేర్పించారు. ఈ కార్యక్రమం గురించి ఎస్ఎల్జీ ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ ''నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు. పిల్లలు సరైన ఆలోచనాతీరుతో ఎదిగేందుకు యోగా తోడ్పడుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల యోగా ప్రాధాన్యంపై అవగాహన పెరుగుతుంది. యోగాతో శారీరక, మానసిక క్రమశిక్షణ అలవడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు యోగా వల్ల తగ్గుతాయన్న విషయాన్ని ప్రపంచమంతా అంగీకరించిందన్నారు. అనంతరం ఇందులో పాల్గొన్న పిల్లలందరికీ ఎస్ఎల్జీ ఆసుపత్రి తరఫున సర్టిఫికెట్లు అందించారు.