Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుమ్మరి శాలివాహనుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సుభాష్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో కుత్బుల్లాపూర్ కుమ్మరి శాలివాహన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై చక్రంపై కుండలను చేసే యంత్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శివనారాయణ, కుత్బుల్లాపూర్ అధ్యక్షులు నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షులు శివ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి కాటయ్య, శిల్పి రాజు పాల్గొన్నారు.