Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికులంతా ఐక్యంగా ఉండి ఏఐటీయూసీ జెండా కింద కలిసి పని చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.యేసురత్నం అన్నారు. ఆదివారం జగద్గిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో బాలరాజు అధ్యక్షతన ఏఐటీయూసీ జగద్గిరిగుట్ట బిల్డింగ్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్, ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు హరినాథ్లు పాల్గొని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయూధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు ధర్మభిక్షం గౌడ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి ర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసం నిత్యం పోరాటం చేసేది ఏఐటీయూసీ అన్నారు. జగద్గిరిగుట్టలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులున్నారని, వారికి ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో రోడ్లపై నిలబడి పనుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. పనుల కోసం వేచ్చి చూస్తున్న కార్మికులు వాహనాలు ఢకొీన్ని ప్రమాదాల భారీన పడుతున్నారన్నారు. కార్మికులందరికి ప్రభుత్వ కార్డులు ఇప్పించి కార్మికులకు సహయం చేయాలన్నారు. నిత్యం కార్మికులు భవన నిర్మాణ యజమానులతో ఎక్కడో ఒక చోట మోసాలకు గురవుతున్నారని, గాయాలైన, మృతి చెందిన వారికి రావాల్సిన సహయం రావట్లేదని, ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మికులకు జరుగుతున్న మోసాలపై ఎప్పటికప్పుడు స్పందించి సహయం చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా సామెల్, కార్యదర్శిగా రాములు, సహయ కార్యదర్శులుగా సోమయ్య,యాదగిరి, ఉపాధ్యక్షులుగా కృష్ణ, కోశాధికారిగా రవిలతో పాటు 11 మందితో పూర్తి కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల సహయ కార్యదర్శి దుర్గయ్య, నాయకులు వెంకటేష్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఏఐవైఎఫ్ నియోజకవర్గం కన్వీనర్ వెంకటేష్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు రాములు పాల్గొన్నారు.