Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్
డాక్టర్ రాకేష్ కుమార్‌కు ది బెస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అవార్డు ప్రదానం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మారుతున్న మన ఆహార అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వల్లనే మధుమేహ వ్యాధి వస్తుందని ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అరోరా డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారికి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బుగ్గారపు దయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం పట్ల నిరుపేదలకు అన్ని వసతులు కల్పిస్తూ ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు కషి చేస్తోందని అన్నారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్ సింగ్ మాట్లాడుతూ చక్కెర వ్యాధి ఉన్నవారిలో అతిగా ఆకలి వేయడం, దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, తొందరగా అలసిపోవడం బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఉస్మానియా ఆస్పత్రి ఎండోక్రైనాలజిస్ట్ ప్రొఫెసర్, డాక్టర్ రాకేష్ కుమార్ సహారు మాట్లాడుతూ మధుమేహం యువతపై పంజా విసురుతుందని, జీవనశైలి మార్పుతో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారని, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు షుగర్ పరీక్ష చేయించుకోవాలని, కాలినడక వ్యాయామం ప్రతిరోజు ఒక గంట అయినా చేయాలని సూచించారు.ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికే ద బెస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అవార్డు-2021ను డాక్టర్ రాకేష్ కుమార్ సహారుకు అందజేశారు. కార్యక్రమంలో ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మనీషా సహారు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ శ్రీరంగ అబ్కారి, తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, నగర అధ్యక్షులు ఎన్.ఆర్.లక్ష్మణ్ రావు గుప్తా, డాక్టర్ టి.కిషోర్ సింగ్ చౌహాన్, డాక్టర్ ఐసాక్ రాజ్, కళాశాల ఎన్.సి.సి కో-ఆర్డినేటర్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.