Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
రంగారెడ్డి జిల్లా చైల్డ్ లైన్ సే దోస్తీ కమిటీ 1098 ఆధ్వర్యం లో పిల్లల హక్కులపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పిల్లల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న వీరి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ 1098 రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్స్ శేఖర్, నరేష్, కొర్పొరేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.