Authorization
Thu April 03, 2025 10:18:06 pm
నవతెలంగాణ- హైదరాబాద్
మనిషి జీవితంతో కవిత్వం ముడిపడి ఉందని నిర్మాణాత్మక మైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఆనందం ఉందని ప్రముఖ కవి, డాక్టర్ శివారెడ్డి అన్నారు. ఆదివారం మలక్‌పేట్ బి బ్లాక్‌లోని ముంతాజ్ కాలేజ్ ఆవరణలో కవి యాకూబ్, శిలాలోలిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ తన మనసులోని భావాలను వ్యక్తీకరించడం కవిత్వం న్నారు. కవిత్వం వేరు కాదని కవిత్వం మనిషిని సజీవంగా ఉంచడానికి నిత్య నూతనంగా పనిచేస్తుందన్నారు. భాషా సంస్కతికి ఒక జాతి మతానికి గుర్తన్నారు. జీవితంలోని సంఘర్షణ ప్రతిరూప వాస్తవం ఆధారంగానే భావ వ్యక్తీకరణతో కవిత్వం రాయడం జరుగుతుందన్నారు. అవార్డుల ప్రదానోత్సవం సభ కార్యక్రమం కోట ఆనందచారి అధ్యక్షతన జరిగిన సభలో హలో డాక్టర్ సీతారాం పాల్గొని ప్రసంగించారు. షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డును మునాసు వెంకట్ (మెద), పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును మందరపు హైమవతి (నీలి గోరింట), కేఎల్ నర్సింగరావు స్మారక అవార్డ్‌లను నరేష్కుమార్ సూఫీ ( నిశ్శబ్ద), గోపాల్ (దండ కడియం)లకు అందచేశారు. సభలో కాసుల రవికుమార్ రచించిన గడ్డ కట్టిన నది, దాసరి నాగభూషణం రచించిన కరోనా కలకలం, పెనుకొండ సర సిజ రచించిన ఇక మారాల్సింది నువ్వే, వంటి పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లిఖిత్ కుమార్, శ్రీనిధి, రావెళ్ల రవీంద్ర, రుక్మిణి, లక్ష్మి శ్రీ, ప్రసాద్, రహీమ్ ఉద్దీన్, గీత, తండా హరీష్‌గౌడ్, తాళ్లపళ్లి శివకుమార్, ఇస్లావత్ గోవర్ధన్ నాయక్, పద్మజ, రాధిక మోహన్ పాల్గొన్నారు.