Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద వర్ధమాన నటి చౌరాసియాపై దాడి జరిగింది. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడిచేసి మొబైల్ లాక్కెళ్లాడు. ఈక్రమంలో జరిగిన పెనుగులాటలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం చౌరాసియా 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గాయపడిన ఆమెను ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.