Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పిల్లల వికాసానికి పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వినరు కుమార్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పిల్లల పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ పాఠాలకన్నా పుస్తక పఠనమే మిన్న అని అన్నారు. బాలల అకాడమీని స్థాపించిన తొలి ప్రధానిగా పండిట్ జవహార్ లాల్ నెహ్రూ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, కుమార్తె ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు గ్రంథాలు రేపటితరం పిల్లలకేంతో ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు వచ్చి పుస్తక ప్రదర్శనను సందర్శించాలని కోరారు. నవంబర్ 30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ప్రముఖ బాలసాహిత్య ప్రచురణాలయాల పుస్తకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు బుచ్చిరెడ్డి, కవి తంగిరాల చక్రవర్తి, డి.కృష్ణారెడ్డి, ధనలక్ష్మి, సుభాషిణి, రఘు తదితరులు పాల్గొన్నారు.