Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోసం రూ.17.50 లక్షలతో రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో శిశువిహార్ వార్డ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరేండ్ల లోపు ఉన్న పిల్లలు, పేరెంట్స్ విడిచిపెట్టిన చిన్నారులు, తప్పిపోయిన పిల్లలకు శిశువిహార్‌లో ఆశ్రయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లలకు వైద్య సేవలను అందించడంలొ నిలోఫర్ ఆస్పత్రికి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని అన్నారు. వైద్యారోగ్య శాఖ బలోపేతం కోసం కేసీఆర్ రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని తెలిపారు. కోవిడ్‌లో వైద్యులు ప్రాణాలకు తెగించి పని చేశారని... ఇక ముందు కూడా అలాగే పని చేయాలన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నానని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.