Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మద్యం పాలసీ 2021-23 సంవత్సరాలకు గాను దరఖాస్తు దారుల నుండి అద్భుతమైన స్పందన వస్తున్నదని మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ అధికారి డి.అరుణ్ కుమార్ తెలిపారు. గతేడాది పాలసీ కంటే ఈ సారి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. మల్కాజిగిరి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో దరఖాస్తులు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. మల్కాజిగిరి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో మొత్తం 88 మద్యం దుకాణాలు నోటిఫై చేయగా సోమవారం వరకు 332 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్ హాల్లో దరఖాస్తు దారులకు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. మల్కాజిగిరిలో మొత్తం 19 మద్యం దుకాణాలకుగాను 61, ఉప్పల్లో మొత్తం 28 మద్యం దుకాణాలకు గాను 61, ఘట్కేసర్లో మొత్తం 41 మద్యం దుకాణాలకు గాను 206 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.