Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్లాట్లను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మేడ్చల్ కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కీసరదాయర రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 184, 185, 186, 196 లో 1985లో గాంధీనగర్ పేరిట లేఅవుట్ చేస్తే వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇండ్ల స్థలాలు కొనుగోలు చేశారన్నారు. కొంత మంది స్థిరవ్యాపారులు హద్దురాళ్లు తొలగించి కొత్తగా మరో లేఅవుట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్లాట్లున్న స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఆర్టీఓ, స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యా దు చేసినా పనులు యధావిధిగా జరుగుతున్నాయన్నాయనీ, ఈ విషయంపై తగు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.