Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హస్తినాపురం : హస్తినాపురం డివిజన్ అగ్రికల్చర్ కాలనీ ప్రతినిధులు జోనల్ కమిషనర్‌కు కాలనీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీ అధ్యక్షులు తాండ్ర మణిపాల్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీ వారు అగ్రి కల్చర్ కాలనీ నుంచి జెడ్పీ రోడ్డుకి వెళ్లే బీటీ రోడ్డుని తవ్వి అడ్డంగా మట్టి పోయడం వల్ల స్థానిక కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షపు నీరు వెళ్ళే రోడ్డు మార్గంలో అడ్డంగా రాతి గోడను నిర్మించడం వల్ల నీరు నిల్వ ఉండే ప్రమాదం కావడంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకుని వెంటనే సమస్యను పరిష్కరిచాలని జనరల్ సెక్రెటరీ పి.ఆర్.ఎస్ శర్మ, ట్రెజరర్ టి.వెంకట్రామ్రెడ్డి కోరారు.