Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్లో 10 రోజుల నుంచి తాగడానికి, వాడుకోవడానికి నళ్లా, బోరు నీళ్లు రాక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు సోమవారం బస్తీలోని మహిళలు వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. తమ సమస్యను వెంటనే తీర్చకపోతే బిందెలతో వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బస్తీ వాసుల సమస్యలనును పలుమార్లు వాటర్ వర్క్స్ జీఎం, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని బస్తీవాసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాములు యాదవ్ వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీనివ్వ డంతో మహిళలు వెనుదిరిగారు. ఇప్పటికైనా వాటర్ వర్క్స్ అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాని బస్తీవాసులు కోరుతున్నారు.