Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజా సమస్యలు ఉన్నంత వరకూ ఎర్ర జెండా పార్టీలుంటాయనీ, ఓట్లు, సీట్లు లేకున్నా ప్రజల తరపున ఉద్యమాలు నిర్వహించడంలో వెనుకంజ వేసేది లేదని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతల యాదయ్య అన్నారు. సోమవారం మేడిపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లా డారు. డిసెంబరు 4,5 తేదీల్లో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా మహాసభలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని కుర్ర ఎల్లయ్య కన్వెన్షన్ హాల్లో జరుగుతాయని తెలి పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానం అవలంభిస్తు న్నాయని చెప్పారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాల్సిన కేంద్రం, కొనేది లేదని ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం అసలు వరి పండించవద్దని ప్రకటించిందన్నారు. ఈ ప్రకటలను చూస్తుంటే... రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేయ కపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరివద్దు అంటున్న ప్రభుత్వం లక్షలాది రూపా యల ప్రజాధనం వినియోగించి భారీ ప్రాజెక్టులు ఎందుకు నిర్మించిందని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఒక్కలాగే ఉందనీ, రెండు ప్రభుత్వాలూ ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారంలో విఫలం
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయనీ, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దు చేసేందుకు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి అన్నారు. దేశ భక్తి ముసుగులో బీజేపీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ పరం చేస్తోందన్నారు. ఇప్పటికే అదానీ, అంబానీ ప్రభుత్వ రంగాలను కట్టబెడుతున్నారనీ, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ సంస్థలను అమ్మేశారని తెలిపారు. దేశంలో వామపక్షాల బలం తగ్గిందని కొందరు అనుకుంటున్నారనీ, అది నిజం కాదన్నారు. కేవలం కార్పొరేట్ కబంధహస్తాల్లో ఉన్న మీడియా ప్రచారమే తప్ప ప్రజా పోరాటాల్లో కమ్యూనిస్టుల బలం ఎన్నటికీ తగ్గదన్నారు.
డబుల్ బెడ్ రూంల లబ్దిదారులను ఎంపిక చేయాలి
మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పాడైపోతున్నాయనీ, ఇప్పటికైనా లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్.సజన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేయకపోతే తామే స్వాధీనం చేసుకుని పంపిణీ చేస్తామని హెచ్చరించారు. జంట కార్పొరేషన్ల పరిధిలో పాలకవర్గం సభ్యులు సంపాదనే ఎకైక మార్గంగా వ్యవహరిస్తున్నారనీ, పార్క్ స్థలాలు, రోడ్లు, బఫర్ జోన్లో నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. మహాసభల అనంతరం ప్రజా సమస్యలపై పోరాట కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమా వేశంలో సీపీఐ(ఎం) మేడిపల్లి మండల నాయకులు కర్రె జంగయ్య, అంజయ్య, శైలజ, ఉప్పల్ సర్కిల్ నాయకులు ఎర్రం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.