Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఒకప్పుడు మన కళలు జాతీయోద్యమాన్ని, సంస్కరణోద్యామాన్ని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ప్రజలకు చేరవేసేందుకు వారిని పోరాట యోధులుగా మలిచేందుకు, కళలు పలు కీలక పాత్ర పోషించాయని, నేటి కళలు సామాజిక పురోగమనానికి తోడ్పడక పోగా సమాజ తిరోగమనానికి దారి తీస్తున్నాయని ప్రజలను చైతన్య పరిచే విధంగా ఉండాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని బుచ్చిరెడ్డి పాలెం గ్రామంలో డప్పుల దళాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ అనేది ఏదైనా ప్రజలను చైతన్యవంతం చేసేదిలా ఉండాలే తప్ప ప్రజలను నిద్రావస్థలోకి నెట్టెలా ఉండకూడదన్నారు. ఇటీవల కాలంలో టెలివిజన్లో ప్రసారం చేస్తున్న బిగ్ బాస్, జబర్దస్త్, అదిరింది, వంటి కొన్ని కార్యక్రమాలు యువతి యువకులను చెడు దారులకు, వ్యసన పరులుగా మారుస్తున్నాయని అన్నారు. కళలు నిర్వహించిన పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని, సామాన్య ప్రజలను సైతం కదిలించి వారికున్న సమస్యలపై ఉద్యమించేలా పని చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్, మండల కమిటీ సభ్యులు యరమల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి దేశ పోగు శ్యాంసోన్, ప్రజానాట్యమండలి నాయకులు జోజి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, కోటిరెడ్డి పాల్గొన్నారు.