Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్పర్సన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి పిలుపు మేరకు మంగళవారం కూకట్పల్లి రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ పెన్షనర్స్ స్కీం విద్రోహ దినం ధర్నా చేపట్టారు. తమ పెన్షన్ను రూ. 9వేలకు పెంచాలని, డీఏ, కుటుంబానికి ఆరోగ్య సదుపాయం, సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని కోరుతూ, ఆర్పీఎఫ్సీ 2 వెంకటేశ్వర్లును కలిసి మెమోరాండం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్తయ్య, శంకర్ రావు, నాయకులు మోహన్ రావు, వెంకట నర్సయ్య, హన్మంత్ రావు, స్వామి, లక్ష్మా రెడ్డి, రాములు పాల్గొన్నారు.