Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రపంచంలో అతిపెద్ద స్వీడిష్ హోం ఫర్నిషింగ్ రిటైల్ సంస్థ అయిన ఐకియా ఇండియా కోవిడ్-19తో ప్రభావితమైన భారతదేశంలోని వివిధ వర్గాల సాధికారతకు ఏ ప్లేస్ కాల్డ్ హోం కార్యక్రమాన్ని ప్రకటించినట్లు ఐకియా ఇండియా సస్టెయినబులిటి మేనేజర్ నిర్మలా సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐకియా ఇండియా కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, రైల్వే చిల్డ్రన్ ఇండియా, లేబర్ గేట్, సెల్కా ఫౌండేషన్, హ్యాబిటాట్ ఫర్ హ్యూమానిటీ సంస్థలతో కలిసి ఎమర్జెన్సీ కమ్యూనిటీ సెల్ అనే సామాజిక సంక్షేమ ప్రాజెక్టును ప్రకటించిందన్నారు. సస్టెనబులిటీ స్టాటజీ ప్లానెట్ పాజిటివ్ ఎప్రోచ్‌లో ఈ ప్రాజెక్టు ఒక భాగమని తెలిపారు. కోవిడ్-19 కారణంగా తమ జీవనోపాధి, ఇండ్లను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ఈ ప్రాజెక్టు పని చేస్తుందన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, అనాథ పిల్లలు, మురికివాడల్లో ఉండే వారిలో కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడిన వారికి ఇది ఉపయోగపడుతుందన్నారు.