Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో 20 ఏండ్లుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న 200 మంది కార్మికులను తొలగించి నాన్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, తక్షణమే నాన్ లోకల్ వారిని తొలగించాలి అని మంగళవారం ఓయూ లైబ్రరీ ఎదుట కార్మికులు నినాదాలు చేశారు. లేని పక్షంలో తెలంగాణ తరహలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు స్టాలిన్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గ్యార నరేష్, జిల్లా అధ్యక్షులు హరికష్ణ, రాష్ట్ర నాయకులు ఉదరు కుమార్, ఓయూ నాయకులు సుమంత్ పాల్గొన్నారు.