Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
అప్స, తెలంగాణ కార్మిక శాఖ సమన్వయ సహకారంతో ముషీరాబాద్ డివిజన్లోని బాపూజీ కమ్యూనిటీ హాల్లో జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్ గుర్తింపు కార్డు కోసం ఉచిత నమోదు కార్యక్రమ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి పనివారు చిరు వ్యాపారాలు, కొరియర్ బార్సు, తోపుడు బండి, కిరాణా షాప్, చేనేత, కమ్మరి, కల్లు గీత, బీడీ కార్మికులు, స్వయం సహాయక సంఘాలు హమాలీలు, లోడింగ్, టైలరింగ్, ఫాస్ట్ ఫుడ్, కార్మికులు, హోటల్ కార్మికులు, కుమ్మరి, మంగలి, వ్యవసాయ, పాడి రైతులు, తాపీ, చేపల వత్తి, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డింగ్, మిడ్ డే వర్కర్స్ , ఆశావర్కర్లు, గోల్డ్ స్మిత్, గ్రామ వాలంటరీస్ 59 ఏండ్ల లోపు వారు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. అప్సలాంటి స్వచ్చంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాల పట్ల కార్మికులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రజనీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పతకాలు పొందాలంటే ప్రతి ఒక్కరికి ఈ శ్ర మ్ గుర్తింపు కార్డు నమోదు తప్పనిసరి అన్నారు. ఉచితంగా నమోదు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. కార్యక్రమంలో ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్, అప్స సమన్వయ కర్త బొట్టు రమేష్, శ్రావణి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు బద్రి నారాయణ పాల్గొన్నారు.