Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అనేక జాతులు కల్గిన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అవసరమని, ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఈఎస్సీఐలో మంగళవారం నిర్వహించిన 'ఎత్నిక్' డే ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేదుల శేఖర్ మాట్లాడుతూ చదవుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడ ముఖ్యమని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్యాకల్టీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని గుర్తుచేశారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగంగా పాటలు పాడడం, డ్యాన్సులు, ర్యాంపింగ్ వంటి కార్యక్రమాలో పాల్గొన్నారని తెలిపారు. అనేక పోటిల్లోని విజేతలకు డైరెక్టర్ రామేశ్వర్రావు చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మికాంతరావు పాల్గొన్నారు.