Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మంచితనం, మానవత్వంతో ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తే మెడలో నుంచి గొలుసు మాయం చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన బైక్పై మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం కిలేడి పంజాగుట్ట సెంటర్లో దిగిపోయింది. తర్వాత కానిస్టేబుల్ తన మెడలో ఉన్న బంగారు గొలుసు మాయం కావడంతో షాక్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.