Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
స్ట్రీట్ వెండర్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14 యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) విద్యాసాగర్ అన్నారు. మంగళవారం కోఠిలోని యూకో బ్యాంకు ఆధ్వర్యంలో పీఎం స్వానిది పథకం ద్వారా 21మంది వీధి వ్యాపారులకు 4.20లక్షలు అందజేసినట్టు తెలిపారు. ఈ రుణంతో వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సివిల్ సప్లై అధికారి రఘునందన్, సీఓలు పాల్గొన్నారు.