Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ౖ'భవిష్యత్ సవాళ్ల కోసం జియోఫిజిక్స్ విద్య పునరుద్ధరణ-సెంటర్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్ పాత్ర' అనే అంశంపై మంగళవారం జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒకరోజు సదస్సు నిర్వహించారు. సదస్సుకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఓయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఓయూ వీసీ ప్రొఫెసర్.డి. రవీందర్, గౌరవ అతిథులు ఎంజీ ఆర్ఐ డైరెక్టర్ వీఎమ్ తివారి, ఏఎమ్‌డీ డైరెక్టర్ డా.డీ.కె.సిన్హా, సైన్స్ కాలేజ్ డీన్ ప్రొఫెసర్. ఏ. బాలకిషన్ పాల్గొని ప్రసంగించారు. జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్లో గతంలో మూడేండ్ల ఎంఎస్సీ కోర్స్ ఉండడం వల్ల వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు విద్యార్థులకు ఎక్కువగా వచ్చాయని గుర్తుచేశారు. 2000 నుంచి రెండేండ్ల ఎంఎస్సీ కోర్స్ ఉండడం వల్ల విద్యార్థులకు ఫీల్డ్ వర్క్‌పై పట్టు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తూ మళ్లీ మూడేండ్ల కోర్సు పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. భౌతిక శాస్త్రం వల్ల భూమి లోపల ఉన్న ఖనిజాలు, ముడి చమురు, సహజ వాయువు, భూకంపాలు, భూగర్భ జలాలను అంచనా వేయవచ్చని అన్నారు. ఈ సదస్సులో వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ వివిధ డిపార్ట్మెంట్ల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.