Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపిహెచ్బీ
జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ అడ్మిషన్స్లో అక్రమాల కు పాల్పడిన డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ డాక్టర్ పీహెచ్.వెంకట రమణారెడ్డిని భర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ అడ్మిషన్స్లో జరిగిన అక్రమాలకు నిరసనగా మంగళవారం జేఎన్టీయూహెచ్ ప్రధాన ద్వారం వద్ద ఆయన దిష్టి బొమ్మను విద్యార్థి సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు జవ్వాజి, దిలీప్, అశోక్‌గౌడ్, నాగరాజు మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీ విద్యార్థులను బీసీ డీ విద్యార్థిగా చూపి బీసీ డీ జెన్ క్వాటంలో అడ్మిషన్ కేటాయించడం చూస్తే వ్యవస్థ ఎంతలా తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం చేసుకొవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెట్, సెట్ గేట్లో మెరిట్ ఉన్నప్పటికీ వారిని ఓపెన్ కేటగిరిలో సీటు పొందకుండ కేవలం తమ కులాలకు సంబంధించిన సీట్లకే పరిమితం చేశారన్నారు. రాత పరీక్షలో ఉతీర్ణత సాధించని ఇంటర్వూ లీస్టులో పేరు లేని వ్యక్తుల సంతకాలు సైతం తయారు చేసే దశకు వెంకటరమణారెడ్డి దిగజారరన్నారు. 50 మంది వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరిట్ ఉన్నప్పటీకీ పీహెచ్డీ అడ్మిషన్ రావటం దారుణమన్నారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అక్రమాలపై విచారణ జరపాలనీ, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్, రుత్విక్, రేవంత్, నవీన్, అభినవ్, వర్షిత్, రోహిత్, శివతేజ, తదితరులు పాల్గొన్నారు.