Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
తమకు 30 నెలల నుంచి జీతాలియ్యట్లేదని , వెంటనే చెల్లించాలని
ఘట్కేసర్ మండలం, అవుషాపూర్‌లోని అరోరా కాలేజీకి చెందిన లెక్చరర్లు, సిబ్బంది ఆ కాలేజీ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ సూ ్టడెంట్స్కు ఆన్లైన్ క్లాసులు చెప్పామని, కాలేజీ ప్రారంభించాక కూడా క్లాసులు కొనసాగించామని తెలిపారు. అయితే 30 నెలల నుంచి ఇప్పటి వరకు తమకు మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో కొన్ని చెక్కులు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తే వాటిని బ్యాంకులో వేశామని, అయితే అవి బౌన్స్ అయ్యాయని తెలిపారు. వెంటనే కాలేజీ మేనేజ్మెంట్ స్పందించి నగదు రూపంలో జీతాలు ఇవ్వాల ని కోరారు. లేకపోతే జేఎన్టీయూలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.